Wednesday, 8 May 2019

దాన వీర శూర కర్ణ - సుయోధనుడు ద్రోణుడి జాత్యాహంకారాన్ని వ్యతిరేకించుట

ఆగాగు! ఆచార్య దేవ, హహ్హ ఏమంటివి? ఏమంటివి ?

జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా !

ఎంత మాట, ఎంత మాట ! ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే ?

కాదు కాకూడదు ఇది కులపరీక్షయే అందువా !

నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది ?
మట్టి కుండలో పుట్టితివికదా ! హహ్హ నీది ఏ కులము?

ఇంతయేల, అస్మతపితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యయగు గంగా గర్భమున జనియించలేదా ! ఈయన దే కులము ?

నాతోనే చెప్పింతువేమయా , మా వంశమునకు మూలపుర్షుడైన వశిష్టుడు దేవవేస్యయగు ఊర్వశీపుత్రుడు కాదా ?
ఆతడు పంచమజాతి కన్యయగు అరుంధతియందు శక్తిని, ఆశక్తి చండాలాంగానయందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు మత్యగంధియందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని , పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును , మా ఇంటిదాసితో ధర్మనిర్మానజనుడని మీచే కీర్తింపబడుచున్న హ.. ఈ విదురదేవుని కనలేదా?

సందర్భావసరములనుబట్టి క్షేత్రభీజప్రాదాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది, కాగా, నేడు కులము.. కులము అను వ్యర్ధవాదములెందుకు?

No comments:

Post a Comment