Wednesday, 8 May 2019

దాన వీర శూర కర్ణ - మాయాజూదంలో సుయోధనుడు గెలిచినపుడు

మాయురే మామా.. మాయురే హహహః
చరిత మరువదు నీ చతురత.. మాట చెల్లించిన నీకే దక్కును యెనలేని ఘనత
మా ఎద సదా మెదలును మామ యెడ కృతజ్ఞత .

ప్రాతిగామి ! ఆ వంచకి పాంచాలిని ఈ సభకు ..

ఓహో
వయోవృ ద్దులు , గురువృ ద్దులు ధర్మబుద్ధులమనుకొను ప్రబుద్ధుల బుద్ధి ఇంత దనుక నిదురబోవుచున్నదా ఏమి ? హహ్హ.. హహ్హ.. ఇప్పుడే లేచి అధర్మము అధర్మమని ఆవులించుచున్నది.

జూతం ధర్మవిరుద్ధము సప్త మహా వ్యసనములలో నీచాతి నీచమైనదని తెలిసియు ఇంతదనుకా మీరేల వీక్షించితిరి?

ఐనను జూతక్రీడారతుడగు ధర్మసుతునితో మామను సరిజోదునుచేసి ఆడించితినే కాని చతుషష్టి కళా విశారదుడనగు నేనాడలేదే ! ఆట తెలియకనా ? హహహ.. ధర్మమూ తెలియును గనుక.

కాని ధర్మాధర్మములు విచారింపక తన తమ్ముల విక్రమోపార్జితములైన సంపదలను, మా తండ్రి దయాలబ్ధమైన ఇంద్రప్రస్థమును తన ఒక్కని సొత్తే ఐనటుల ఈ పాండు సుతుడు ఒడ్డినపుడు ఇది ధర్మము కాదని మీలో ఒక్కరైనను పెదవి కదపిరా ?

తమనొడ్డినపుడైన తమ్ములు నోరు మెదపిరా ?

ఆలిని ఓలిగా పెట్టినప్పుడైన ఆ మగువను మగటిమితో మత్స్య యంత్రము కొట్టి తెచ్చుకొన్న వాడను నేను పాంచాలిపై మీకేమి అధికారమున్నదని అర్జునుడైన అన్న నడిగెన ?

చతుర్విధ పురుషార్ధములలో సహధర్మచారిణి ఐన ధారను దయారహితముగా పందెము వైచునప్పుడైనను, అవ్వ ! ఇది అమానుషమన్నవారులేరే ?

అ.. ఆ..
నేను గెలచుటచే మయా తిరోతరమైనది , ధర్మజుడే గెలచిన ధర్మమే జయించినదని మీరు జేజేలు కొట్టిఉండెడి వారు కాదా !

మీ పాండవ పక్షపాత బుద్ధితో ధర్మ దేవతను ఖండించి అధర్మ దేవతను ప్రళయ తాండవ మాడింపకుడు ..

తాతా! అలనాడు స్వయంవర సమయమున నా కూర్మి మిత్రుడగు కర్ణుని సూతకుల ప్రసూతుడని వదరి వర బహిష్కారము చేసిన ద్రుపదునకు బుద్ధి చెప్పుటకు ఇది ఒక ప్రయత్నం.

నాడు నను అతిధిగా ఆహ్వానించి పరిహసించిన పంచ భర్త్రుక పాంచాలి పై పగ సాధించుటే దీని ఆంతర్యం.

అంతియేకాని మా పితృ దేవ దయాలబ్ధమైన ఎంగిలి కూటికాశపడు అల్పుడను కాను, అందునా జూతార్జితమగు విత్తము పై చిత్తము నుసిగొల్పు అధముడను కాను.

నా హృదయాగ్నిజ్వాలా ప్రతిరూపమే ఈ జూతము తాతా, ఆ ప్రతీకార జ్వాలలే పాంచాలిని ఆవరించినవి. మర్మ ధర్మములతో, పక్షపాత బుద్ధులతో పాతక కర్మలతో మనుగడ సాగించు మీరీ మహాసభలో మాట్లాడ అనర్హులు. మీ హితోపదేశం కట్టిపెట్టండి, కూర్చోండి.

No comments:

Post a Comment