Wednesday, 8 May 2019

దాన వీర శూర కర్ణ - మయసభ ఘట్టం

అహొ !
అమ్లానభావసంభావితమైన ఈ దివ్యప్రసూనమాలికారాజమును కురుసింహుని గళసీమనలనలంకరించిన వారెవ్వరు ? అ.. హహహ ..

అనిమిషయామినీ అతిధిసత్కార దివ్యసేవాప్రభావమౌనా ! ఔ,, ఔ,,

ఆ.. హహ్హహ,,
ఓ..
ఆ.. ఏమా సుమధుర సుస్వరము !
కాకలీకలకంటికంటి కూకూఉకారసుతిహిత దివ్యసురకామినీ కామినీయక సుస్వాగతమౌనా ! హాహ్హహ.. అహా .
సొబగు సొబగు.. సొబగు సొబగు..

ఔరా.. ఇది శాస్త్రవిజ్ఞాన ప్రభావమా ! హాహ్హహ..
ఔ.. ఔ..

అయ్యారే !
భ్రమ.. ఇదినా భ్రమ ..
కించిత్ మధుపానాసక్తమైన మా చిత్త భ్రమ..

భళా !
సముచితసత్కారస్వీకారసంత్రుప్తస్వాంతుడనగు ఈ కురుభూకాంతుని సంభావనాసంభాషణాభూషణములచే ఈ సభాభవనము ధన్యము..ధన్యము..

అకుంచితనిర్మాణచాతురీదుర్యుడవగు ఓ మయబ్రహ్మా.. నీ శిల్పచాతురీమధురిమ ఆ బ్రహ్మకుగాని విశ్వబ్రహ్మకుగాని లేదు.. లేదు.. లేదు ..

ఆ.. లేవచ్చును, లేకపోవచ్చును.. కాని పాండవహతకులకిట్టి పరిషత్తు లభించుటమాత్రం మానధనులమైన మాబోంట్లకు దుస్సహము.

విశ్వవిశ్వంబరావినుతశాశ్వతమహైశ్వరీమహైశ్వరులము కావచ్చు..

అఖిల నదీనదసాగరవారిదర్గర భూకృత అనఘ్రముక్తామణీమ్రాతమ్ములు మాకుండిన ఉండవచ్చు..

సాగరమేఘరాసతీకరగ్రహణంబోనర్చి సార్వభౌమత్వమందిన అందవచ్చు..

కాని ఇట్టి సభాభవనము మాకు లేకపోవుట మోపలేని లోపము.

చతుర్కృతాపచారములకంటే శత్రు వైభవము శక్తిమంతుల హృదయములకు దావాలనసధృశము. ఇక మేమిందుండరాదు.

ఏమీ ! నిరాఘాటపదట్టనకు నాకీ కవాటఘట్టనమా ! పరులేవ్వరు లేరుకదా ! మా భంగాపాటును పరికించలేదుకదా!

ఇస్సీ! ఈమయసభను మాకు విడిదిపట్టుగా పెట్టుట నిస్సందేహముగా ఆ పాండవ హతకులు మమ్ము అవమానిచుటకే.

ఆ.. ఏమీ ! సభాభవన గర్భమున సుందర జలచరసంతియైన జలాశయమా ! ఆహ్

అంతయు మయామోహితముగా ఉన్నదే !

ఉ.. అహ్హహ్హ.. ఇదియును అట్టిదియే.. అహహ్హహ...

పాంచాలీ... పంచభర్త్రుక ...

వదరుపోతా.. వాయునందనా ...

పాంచాలి.. పంచభర్త్రుక.. ఏమే.. ఎమేమే.. నీ ఉన్మత్తవికటాట్టహాసము ? ఎంత మరువయత్నించినను మరపునకురాక హృదయ శల్యాభిమానములైన నీ పరిహాసారవములే నాకర్ణపుటములను వ్రయ్యలు చేయుచున్నవె.

అహొ ! క్షీరావారాసిజనితరాకాసుధాకర వరవంశసముత్పన్నమహొత్తమ క్షత్రియ పరిపాలిత భరతసామ్రాజ్యదౌరేయుండనై ...

నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశభువన శూరవరేణ్యులగు శతసోదరులకు అగ్రజుండనై ...

పరమేశ్వర పాదాభరిత పరశురామ సద్గురుప్రాప్త శస్త్రాత్రవిద్యాపారియుండైన రాధేయునకు మిత్రుండనై..

మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడుది పరిచారికా పరీవృతయై పగులబడి నవ్వుటయా ?

అహొ ! తన పతులతో తుల్యుడనగు నను భావగా సంభావింపక, సమ్మానింపక.. గృహిణిధర్మ పరిగ్దగ్ధయై.. లజ్జావిముక్తయై.. ఆ పంతకి పాంచాలి ఎట్టఎదుట యేల గేలి సేయవలె ?

అవునులే.. ఆ బైసిమాలిన భామకు ఎగ్గేమి ? సిగ్గేమి ? వొంతువొంతున మగలముందొక మగనిని వచ్చనపర్యంతము రెచ్చిన కడుపిచ్చితో పచ్చిపచ్చి వైభవమున తేలించు ఆలి గేలి సేసిన మాత్రమున హహ.. హహ.. మేమేల కటకట పడవలె ?

ఊరకుక్క ఉచితానుచిత జ్ఞానముతో మోరెత్తి కూతలిడునా ! ఆ.. అని సరిపెట్టుకొందున ! ఈ లోకమును మూయ మూకుడుండునా !

ఐనను దుర్వ్యాజమున సాగించు యాగమని తెలిసి మేమేల రావలె ... వచ్చితిమి పో !

నిజరత్నప్రభాసమపేతమై సర్వర్త్రు సంశోభితమైన ఆ మయసభాభవనము మాకేల విడిది కావలె.. అయినది పో !

అందు చిత్రచిత్ర విచిత్ర లావణ్య లహరులలో ఈదులాడు విద్రుక్షాపేక్ష అహ్హా.. మాకేల కలుగవలె ... కలిగినది పో !

సజీవ జలచర సంతాలవితాలములకు ఆలవాలమగు ఆ జలాశాయములో మేమల కాలు మోపవలె .. మోపితిమి
పో !

సకల రాజన్యుకోటీరకోటిసంక్షిప్త రత్నప్రభా నీరాజితంబగు మాపాదపద్మమేల అపభ్రమనం చెందవలె.. ఏకత్సమయమునకే పరిచారికాపరీవృతయై ఆపాతకి పాంచాలి యేల రావలె..వీక్షించవలె.. పరిహసించవలె ?

ఆ విధి.. హా విధి.. హా హతవిధీ..

ఆజన్మ శత్రువులేయని అనుమానించుచునే అరుదెంచిన మమ్ము అవమాన బడబానలా జ్వాలలు ధగ్ధమోనర్చుచున్నవి మామా..

విముఖునిసుముఖునిజేసి మమ్మితకు విజయముసేయించిన నీ విజ్ఞాన విశేష విభావాదిత్యములు ఏమైనవి మామా ?

పాంచాలీ కృతావమాన మానసుడనై, మానాభిమానవర్జితుడనై మర్యాదాతిక్రమనముగా మనుటయా.. లేక పరిహాసపాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుటయా..

ఇస్సీ.. ఆడుదానిపై పగసాదింపలేక అశు పరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి ఆపైన వేరొకటియా...

ఇప్పుడేదీ కర్తవ్యము ? మనుటయా? మరణించుటయా ?

No comments:

Post a Comment